గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (13:55 IST)

ఆమ్లెట్‌లో పెప్పర్ ఎక్కువైంది.. వాక్యూమ్ క్లీనర్‌తో తొలగించాడు.. చివరికి? (Video)

ఆమ్లెట్‌లో పెప్పర్ ఎక్కువైంది. దాన్ని తీసేయాలనుకున్నాడు. ఎలా అని ఆలోచించాడు. చివరికి వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఎంచుకున్నాడు. ఆమ్లెట్ లోని  పెప్పర్‌ను తీసేయబోయి.. ఆమ్లెట్‌నే దూరం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే... ఆమ్లెట్ మీద చల్లిన పెప్పర్‌ని తీసేందుకు వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించాడు. కాకపోతే ఒకటే బాధాకరం. తొలిగించాలనుకున్న పెప్పర్‌తోపాటు గుడ్డు కూడా పోయింది. ఆర్య 2 సినిమాలో గుడ్డు మాయమైనట్లుగా ఇక్కడ కూడా గుడ్డు మాయమైంది. ఈ వీడియో చూస్తే మీరే షాక్ అవుతారు. 
 
ఇంట్లో దుమ్ము, ధూళిని పీల్చేసినట్లుగా కోడిగుడ్డుపై వున్న పెప్పర్‌ను పీల్చేస్తుందిలే అని వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించాలనుకున్నాడు. మొదట్లో వాక్యూమ్ క్లీనర్‌తో బాగానే తొలగిస్తున్నాడు. సరిగ్గా గుడ్డు మీదకు తీసుకురాగానే గుడ్డు మాయమైంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.