శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2019 (14:11 IST)

జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్-2

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 వ్యోమనౌక.. జాబిల్లికి మరింత చేరువైంది. మరో 10 లేదా 11 రోజుల్లో చంద్రుడి చెంతకు చేరనుందని ఇస్రో వెల్లడించింది. మరోవైపు, బుధవారం ఉదయం 09.04 గంటలకు మూడోసారి కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వెల్లడించింది. 1190 సెకన్లపాటు ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను మండించి 179 కి.మీ.x 1412 కి.మీ. కక్ష్యలోకి చంద్రయాన్‌-2ను విజయవంతంగా చేర్చినట్లు పేర్కొంది. 
 
తదుపరి కక్ష్య కుదింపు ప్రక్రియను ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6-7 గంటల మధ్య చేపట్టనున్నట్లు తెలిపింది. అనంతరం సెప్టెంబర్‌ 1న మరోసారి కక్ష్యను కుదిస్తారు. సెప్టెంబర్‌ 2న ఆర్బిటార్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ప్రక్రియను చేపడుతారు. సెప్టెంబర్‌ 7న వేకువజామున 1.55 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌.. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో కాలుమోపుతుందని ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.