శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (18:19 IST)

చెన్నై: హాస్టల్ క్యాంటీన్.. చట్నీ పాత్ర నుంచి ఎగిరిపడిన ఎలుక

చెన్నైకి చెందిన ఓ కళాశాల క్యాంటీన్‌లో విద్యార్థులకు అందించే చట్నీ నుంచి ఎలుక పరుగులు తీసిన ఘటన సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై సెమ్మంజేరిలోని ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్‌లోని చట్నీ నుంచి ఓ ఎలుక ఎగిరి బయటికి రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. 
 
సెమ్మంజేరిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఆహారాన్ని అందించే హాస్టల్ క్యాంటీన్‌లోని చట్నీ పాత్ర నుంచి ప్రాణాలతో వున్న ఎలుక ఎగరి గంతేయడం అందరికీ షాక్ ఇచ్చింది. 
 
చట్నీ పాత్ర నుంచి ఎలుక బయటికి రావడంతో విద్యార్థులు పరుగులు తీశారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. తమకు అందించే ఆహారంలో నాణ్యత లోపించిందని.. శుభ్రత పూర్తిగా లేదని ఆందోళన చేపట్టారు.