శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Modified: శనివారం, 22 మే 2021 (18:13 IST)

Anandayaa కరోనా మందు వర్కవుట్ కాలేదా?!! మళ్ళీ క్షిణించిన కోటయ్య ఆరోగ్యం

నెల్లూరు: రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్‌ లెవల్స్‌ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ రోజు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు.

కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్‌ పడింది. కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందం రానుంది.
 
బ్లాక్‌మార్కెట్‌లో ఆనందయ్య కరోనా మందు
మరో వైపు కరోనా మందు పేరుతో బ్లాక్‌మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్‌ మార్కెట్‌లో రూ.3 వేల నుంచి 10 వేల డిమాండ్ ఏర్పడింది..