శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (10:46 IST)

ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన రెజ్లర్ బబితా ఫొగట్

భారత్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగట్. గత 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు బతకాలను సాధించిపెట్టింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చాఖ్రీదాద్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆమె తన ప్రత్యర్థుల కంటే ముందున్నారు. 
 
చాఖ్రీ దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె... ప్రత్యర్థులక కంటే ముందంజలో ఉన్నారు. గురువారం కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమెకు... బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. ప్రజలపై తనకు నమ్మకం ఉందని... వారి ప్రేమాభిమానాలే తనను ముందుకు సాగేలా చేస్తున్నాయని తెలిపారు. 
 
మరోవైపు, హర్యానా రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకిరానుంది. మొత్తం 90 సీట్లకుగాను బీజేపీ 38 చోట్ల, కాంగ్రెస్ 29 స్థానాల్లో జేజేపీ 12, ఐఎన్ఎల్డీ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీస మెజార్టీ 46 స్థానాలను దక్కించుకోవాల్సివుంది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటయ్యే అవకాశాలు కనిపించినప్పటికీ... బీజేపీనే కింగ్ మేకర్‌గా అవతరించనుంది.