శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (21:27 IST)

మతం మార్చుకున్న నటి సంజనా గల్రానీ, నిజమేనా?

బెంగళూరు: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుభాషా నటి సంజనా గల్రాని మతం మార్చుకున్నారు? అనే ఆరోపణలు మొదలయ్యాయి. స్యాండిల్ వుడ్ చిత్ర పరిశ్రమకు డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉందనే ఆరోపణలు మొదలైనప్పటి నుంచి నటి సంజనా, రాగిణి దివ్వేది పేర్లు తెరమీదకు రావడం, ఆ ఇద్దరు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లడం చకచకా జరిగిపోయాయి.
 
అయితే ఇప్పుడు నటి సంజనాపై మరో ఆరోపణ తెర మీదకు వచ్చింది. లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా మతం మార్చుకుని ఆమె పేరును మహిరాగా మార్చుకున్నారని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి సంచలన ఆరోపణలు చెయ్యడంతో ఆమె అభిమానులు ఉలిక్కిపడ్డారు. లవ్ జీహాద్‌లో భాగంగా లవర్ అజీజ్ దెబ్బతో నటి సంజనా మతం, ఆమె పేరు మార్చుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపింది.
 
స్యాండిల్ వుడ్ బ్యూటీ క్వీన్ సంజనా మీద మొదటి నుంచి ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. 2018లో నటి సంజనా హిందూ మతం నుంచి మారిపోయారని ప్రశాంత్ సంబర్గి ఆరోపిస్తున్నారు. 2018లోనే నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి ఆమె పేరును మహిరాగా మార్చుకున్నారని ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి ఆయన ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.
 
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) పోలీసులు నటి సంజనా గల్రానీని అరెస్టు చేసి చార్జ్ షీటు తయారుచేసి కోర్టులో సమర్పించారు. వారం రోజులకు పైగా నటి సంజనాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జ్ షీటులో నటి సంజనా గల్రాని అని నమోదయ్యిందని, మహిరా అనే పేరు ఎక్కడా లేదని వెలుగు చూసింది.
 
స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా గల్రాని, ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని వెలుగు చూసింది. ఇప్పటికే ఇస్లాం మతం ఆచారం ప్రకారం డాక్టర్ అజీజ్, నటి సంజనా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ, లాక్‌డౌన్ కారణంగా నటి సంజనా, డాక్టర్ అజీజ్‌ల పెళ్లి వాయిదా పడింది.
 
ప్రముఖ వ్యాపారి, ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి కొన్ని పత్రాలను ఫేస్ బుక్‌లో పంచుకున్నారు. దరుల్ ఉలుమ్ షా వలివుల్లా అనే పేరుతో ఫేస్ బుక్‌లో ఓ లేఖ పంచుకున్న ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి ఇక ముందు నటి సంజనా అలియాస్ అర్చనా మనోహర్ గల్రానిని ఆ పేర్లతో పిలవకూడదని, ఆమె ఇస్లాం మతం స్వీకరించిందని, ఆమెను మహిరా అని పిలవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన నటి సంజనా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన నటి సంజనాపై మొదటి నుంచి ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుతం బెంగళూరులోని చామరాజపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్‌తో కలిసి నటి సంజనా శ్రీలంక టూర్‌కు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
నటి సంజనా వ్యవహారం ఎక్కడికిపోయి ఎక్కడికి వస్తుందో? అనే విషయం అంతు చిక్కకపోవడంతో ఆమె అభిమానులు సన్నిహితులు అయోమయానికి గురవుతున్నారు. తను మాత్రం సంజనా వ్యవహారం మొత్తం బయటపెడుతానని, ఆమె బాగోతం మొత్తం ప్రజలకు వివరిస్తానని ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి పదేపదే చెబుతున్నారు. మొత్తం మీద లవ్ జీహాద్ దెబ్బతో నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి మహిరాగా పేరు మార్చుకున్నారా? లేదా? అనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.