శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 4 జులై 2018 (16:30 IST)

రాముడిపై వ్యాఖ్యలు.. కత్తికి నాగబాబు వార్నింగ్.. ఆ నీచుడిని కఠినంగా శిక్షించండి..

ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడిని హిందువులు ఎంతో భక్తిభావంతో కొలుస్తారు. దశావతారాల్లో ఒకటైన శ్రీరాముడు మానవుడిగా భూమిపై జీవించారనేందుకు రామసేతు ఓ చక్కని సాక్ష్యాధారం. అలాంటి శ్రీరాముడిపై దారుణమైన వ్యాఖ్యల

ఏకపత్నీ వ్రతుడైన శ్రీరాముడిని హిందువులు ఎంతో భక్తిభావంతో కొలుస్తారు. దశావతారాల్లో ఒకటైన శ్రీరాముడు మానవుడిగా భూమిపై జీవించారనేందుకు రామసేతు ఓ చక్కని సాక్ష్యాధారం. అలాంటి శ్రీరాముడిపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్.


గతంలో వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకు చిక్కిన కత్తి.. ఈసారి రాముడిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణకు అనంతరం విడుదల చేశారు. అయినా కత్తి రామునిపై సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్లు చేశాడు.
 
ఈ నేపథ్యంలో శ్రీరాముడిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. ఏమతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడినా తప్పేనని అన్నారు.

రామాయణం అనేది పుస్తకం కాదని... కోట్లాది మంది ఆరాధించే శ్రీరాముడి చరిత్ర అని అన్నారు. ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎలాగో... హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివని గుర్తు చేశారు.
 
హిందూమతం, హిందూ దేవుళ్లపై ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని నాగబాబు ఆరోపించారు. కొన్ని మీడియాలు హిందు మతానికి వ్యతిరేకంగా కొమ్ము కాస్తున్నాయని నాగబాబు తెలిపారు. నాస్తికత్వం పేరుతో హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించినందుకు శిక్ష అనుభవిస్తారన్నారు.

మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కత్తి మహేష్‌పై ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని... లేకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని తెలిపారు. 
 
తన మతం మీద, తన రామాయణం మీద కామెంట్ చేసిన నీచులను కఠినంగా శిక్షించాలి. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి కూడా తన మనసు అంగీకరించడం లేదని... అతడికి భయంకరమైన శిక్ష పడితీరాలి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ ఈ విషయంలో స్పందించకపోతే చారిత్రాత్మక తప్పిదం చేసిన వారవుతారని, హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేసిన వారవుతారని నాగబాబు ఓ వీడియో ద్వారా పేర్కొన్నారు. ఏ ఒక్క మతంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. 
 
నూటికి 80 శాతం సంస్థలు హిందూ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తిచేయడంలో ముందున్నాయి. ఇలాంటి మత సంబంధమైన డిబేట్స్ పెట్టకూడదని ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేయాలి. ఎవడి ఇష్టం వచ్చినట్లు వాడు హిందువులను తిడుతుంటే చేతులు కట్టుకుని ఎవరూ కూర్చోరు. ఈ విషయంలో తాను స్వామి పరిపూర్ణానంద స్వామికి సంపూర్ణ మద్దతిస్తున్నానని తెలిపారు. 
 
కాగా మెగా హీరో నాగబాబు వ్యాఖ్యలపై కత్తి మహేశ్‌ స్పందించాడు. రామాయణంపై తనకు తెలిసిన విశ్లేషణను, అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానన్నాడు. రాముడిని నమ్ముతున్న వారిని కించపరిచే విధంగా కామెంట్స్ చేయలేదన్నాడు.