గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:24 IST)

నాగార్జున, చిరంజీవిలు టిక్కెట్లు అమ్మమంటేనే అమ్ముతున్నాం: రోజా

సినిమా టిక్కెట్లను అమ్మి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాల్సిన అవసరం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు రోజా. విఐపి విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో రోజా మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు బాధాకరమని.. ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు, కోడెల శివప్రసాద్‌కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.
 
ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. సినిమా టిక్కెట్లు ఆన్లైన్‌లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.