ఆదివారం, 14 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (17:13 IST)

ప్రపంచంలో తిరుగులేని నేతగా ప్రధాని నరేంద్ర మోడీ

pmmodi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు తిరుగులేని నేతగా నిలిచారు. ప్రపంచ స్థాయి నేతల్లో మరోమారు తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రపంచలోని గొప్ప నేతల జాబితాలో ప్రధాని మోడీ 77 శాతం రేటింగ్‍‌తో అగ్రస్థానంలో నిలిచారు. 
 
ఆ తర్వాత 56 శాతం రేటింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని రెండో స్థానంలో నిలించారు. ఆ తర్వాతి స్థానాల్లో 41 శాతం రేటింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మూడో స్థానం, 38 శాతం రేటింగ్‌తో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో, 36 శాతం రేటింగ్‌తో బ్రిటన్ ప్రధాని రిషి సునక్, 23 శాతం రేటింగ్‌తో జపాన్ ప్రధాని కిషిండాలు వరుస స్థానాల్లో నిలిచారు 
 
ఈ సర్వేను మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూపు నిర్వహించి వెల్లడించింది. మొత్తం 22 దేశాధినేతల రేటింగ్‌తో ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ఈ యేడాది ఆగస్టులో నిర్వహించి వెల్లడించిన జాబితాలో కూడా ప్రధాని మోడీ 75 శాతం రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచిన విషయం తెల్సిందే.