ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (09:15 IST)

నరేంద్ర మోడీ గుజరాత్‌కు మాత్రమే ప్రధాని : రాజ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచల వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికే ప్రధాని అని రాజ్‌థాక్రే విమర్శించారు. ఇదే అంశంపై

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే సంచల వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికే ప్రధాని అని రాజ్‌థాక్రే విమర్శించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముంబై-వడోదర ఎక్స్‌ప్రెస్ వే, బుల్లెట్ రైలు నిర్మాణాల కోసం రైతులు తమ భూములు ఇవ్వవద్దని కోరారు.
 
అంతేకాకుండా, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు భూముల సేకరణ ప్రారంభమైందనీ, దీంతో ధనవంతులైన గుజరాతీలు ఈ రైలు రూట్లో భూములు కొనుగోలు చేస్తున్నారని రాజ్‌థాక్రే చెప్పారు. మొత్తం 380 కిలోమీటర్ల మేర భూములను ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం తీసుకుంటున్నందున రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడాలని రాజ్‌థాక్రే పిలుపునిచ్చారు. 
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైకు గుజరాత్‌ను చేరువ చేసేందుకే బుల్లెట్ రైలు నిర్మిస్తున్నారని, ఇది ఇతరుల ప్రయోజనం కోసం కాదనీ, కేవలం గుజరాతీయుల కోసమేనని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజలు కులాల వారీగా రిజర్వేషన్ల కోసం, ఇతరులు ముంబైలోకి ప్రవేశానికి వ్యతిరేకంగా  పోరాటం సాగిస్తామని ఆయన ప్రకటించారు.