శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2019 (14:57 IST)

కొలిక్కి వచ్చిన మహాసంక్షోభం : సేన - ఎన్సీపీ - కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంశం ఓ కొలిక్కి వచ్చింది. 56 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్ పార్టీలు సమ్మతించాయి. దీంతో ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రి పీఠంపై శివసేనకు చెందిన నేత ఆశీనులుకానున్నారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి పదవిని ఎన్సీపీకి, అసెంబ్లీ స్పీకర్ పోస్టును కాంగ్రెస్ పార్టీకి కేటాయించనున్నారు. మంత్రి పదవులను కూడా మూడు పార్టీలు పంచుకోనున్నాయి. మొత్తం మంత్రిపదవుల్లో శివసేనకు 16, ఎన్సీపీకి 14, కాంగ్రెస్ పార్టీకి 12 చొప్పున కేటాయించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తలా రెండున్నరేళ్ళ పాటు పంచుకోనున్నాయి. ముఖ్యమంత్రి పదవిని మాత్రం ఐదేళ్ళపాటు శివసేనకు ఇచ్చేందుకు ఎన్సీపీ - కాంగ్రెస్ పార్టీలు సమ్మతించాయి. 
 
ఇదే అంశంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ, మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలైందంటూ ప్రకటించారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. శివసేనకు పూర్థి స్థాయిలో సీఎం పదవి... ఎన్సీపీ, కాంగ్రెస్ లకు చెరో 14 మంత్రి పదవులతో పాటు చెరో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు ఆయన తెలిపారు.