ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 ఆగస్టు 2023 (21:17 IST)

కెప్టెన్ విజయ్ కాంత్ 71వ బర్త్ డే... షాకింగ్, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్

Vijay Kanth
కర్టెసి-ట్విట్టర్
తమిళనాడులో విజయ్ కాంత్ అంటే ఓ క్రేజ్. ఆయన్ను కెప్టెన్ విజయ్ కాంత్ అని పిలుచుకుంటుంటారు. ఆ చిత్రంతో ఆయన సూపర్ పాపులారిటీ సాధించారు. అసలు విషయానికి వస్తే... డీఎండీకే ప్రధాన కార్యదర్శి విజయకాంత్ తన 71వ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని కోయంబత్తూరులోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
 
ఈ సందర్భంగా ఆయనను డైరెక్టుగా చూసిన చాలామంది ఆయన గుర్తించలేనంతగా మారిపోవడాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడలేనంత కృంగిపోయి వుండటాన్ని చూసి బాధపడుతున్నారు. విజయకాంత్ పుట్టినరోజు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఆయన ఫోటోలు నెట్‌లో దర్శనమిస్తాయి.
 
ఐతే ఈసారి నేరుగా ఆయనను గుర్తుపట్టలేనంతగా సన్నగా మారిపోవడాన్ని చూసి అభిమానులు కంగారు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు విజయ ప్రభాకరన్ ఇటీవల విలేకరుల సమావేశంలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం కెప్టెన్ ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉందన్నారు. కెప్టెన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు విజయ ప్రభాకరన్ తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
తమిళ సినిమాకు కెప్టెన్ విజయకాంత్ నిధి అని చెప్పాలి. మంచి నటుడే కాకుండా మంచి మనిషి కూడా. తనను కోరిన వారికి తాను చేయగలిగినదంతా చేస్తుంటారు. సినీరంగంలో విజయకాంత్ చాలా మందికి అవకాశం ఇచ్చారు. విజయకాంత్ సినిమాలు చేసే సమయంలో షూటింగులో సామాన్యులు తినే ఆహారాన్నే తినేవారు.