శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (11:25 IST)

#clubbie డైపర్ బాలుడు.. ఎలా క్రికెట్ ఆడుతున్నాడో.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో ప్రస్తుతం పలు వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజగా డైపర్ వేసుకుని ఓ బుడ్డోడు క్రికెట్ ఆడే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫాక్స్‌ క్రికెట్‌ సంస్థ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఒక చిన్నారి క్రికెట్ ఆడుతూ ఉంటాడు.

టీషర్టు, డైపర్‌ ధరించిన ఆ బుడ్డోడు… బ్యాటు పట్టుకుని ఇంట్లో క్రికెట్‌ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడుతూ ఉన్నాడు. గ్లౌవ్స్‌ కూడా ధరించి లాంగ్‌ ఆన్‌ షాట్లు, స్ట్రైట్‌ డ్రైవ్స్‌ ఆశ్చర్యపోయే ఫుట్ వర్క్, దిగ్గజ ఆటగాళ్లకు సైతం కుదరని స్టైల్లో తాను ఆడటం చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.
 
అతనిలో నైపుణ్యాన్ని చూసిన క్రికెట్ అభిమానులు అయితే త్వరగా క్రికెట్ లోకి వచ్చేసేయ్ అంటూ పిలుపునిస్తున్నారు. చదువు కూడా పక్కన పెట్టి వచ్చేసేయ్ నీ కోసం పిచ్‌లు సిద్ధంగా వున్నాయని చెప్తున్నారు.

పేస్ బౌలర్లు నీ వికెట్ కోసం ఎదురు చూస్తున్నారు… మీ అమ్మా నాన్నకు చెప్పు… నాకు క్రికెట్ ప్రపంచం ఉంది డిస్టర్బ్ చేయొద్దని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా అతని ఆట చూసి వీడియోని తాను కూడా పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వరల్డ్ వైడ్ ట్రెండింగ్‌లో నిలిచింది.