1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (12:19 IST)

విదేశీయులకు వీధికుక్కలు స్వాగతం పలకడమా.. రాజమౌళి స్వీట్ వార్నింగ్

ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో జ‌క్క‌న్న బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యిందని ఇటీవ‌ల చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని చిత్ర బృదం తెలిపింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిర్ పోర్టులో జక్కన్న చేదు అనుభవం మిగిలింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజ‌మాన్యానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రీసెంట్‌గా దేశ రాజ‌ధానికి ఢిల్లీకి వెళ్లిన రాజ‌మౌళికి అక్క‌డ ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించిన దృశ్యాలు చాలా బాధ క‌లిగించాయి. వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని యాజ‌మాన్యానికి తెలిపే ప్ర‌య‌త్నం చేశాడు. భారతదేశ ప్రతిష్ట కోసం వాటిపై దృష్టి పెట్టాలని కోరాడు.
 
డియర్ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌.. నేను లుప్తాన‌స ఎయిర్‌వేస్‌లో రాత్రి ఒంటి గంట స‌మయానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి వ‌చ్చాను. అక్క‌డ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం ఫిల్ చేయ‌మ‌ని కొన్ని ఫాంస్ ఇచ్చారు. ఆ ఫాం ఎలా ఫిల్ చేయాలో తెలిపే వారు లేరు. 
 
క‌నీసం ఎయిర్ పోర్ట్ గోడ‌ల‌పైన అయిన ఉంటాయేమో అని చూసాను. ఎక్క‌డ ఆ స‌మాచారం లేదు. ఇక ఎగ్జిట్ గేట్ దగ్గ‌ర ఆక‌లితో ఉన్న‌ వీధి కుక్క‌లు గుంపులుగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. విదేశాల నుండి వ‌చ్చిన పాశ్చాత్యుల‌కు ఇలాంటి దృశ్యాల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డం దేశ గౌర‌వానికి అంత మంచిది కాదు. ఇలాంటి దుర్భ‌ర ప‌రిస్థితుల‌పై దృష్టి పెడ‌తార‌ని ఆశిస్తున్నాను అంటూ రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.