బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: సోమవారం, 6 మే 2019 (17:33 IST)

CBSE టెన్త్ క్లాస్ టాపర్స్... 13 మందికి 499/500 (వీడియో)

సోమవారం నాడు సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 13 మంది విద్యార్థినీవిద్యార్థులు 499/500 మార్కులు సాధించి టాపర్స్‌గా నిలిచారు. విద్యార్థినీ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 91.1 శాతంగా వుంది. అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన నగరాల్లో టాప్ 3గా త్రివేండ్రం 99.85 శాతం, చెన్నై 99 శాతం, అజ్మీర్ 95.89 శాతంగా నిలిచాయి.
 
కాగా సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి పరీక్షలు జరిగి 38 రోజుల్లోనే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేసింది. మార్చి 29, 2019న సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. పరీక్షా ఫలితాల్లో జాప్యం జరిగితే విద్యార్థుల అడ్మిషన్లలో కూడా జాప్యం ఏర్పడుతుందని.. అందుకే ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలను పరీక్షలు జరిగిన 30 రోజుల్లోనే విడుదల చేయడం జరిగిందని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది.