శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 25 మార్చి 2020 (23:37 IST)

తిరుమల ఇలా కూడా వుంటుందా? ఆశ్చర్యంలో జనం...

కరోనా వైరస్ దెబ్బతో ఆలయాలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. అయితే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచిన అధికారులు భక్తులను దర్సనానికి అనుమతించడం మానేశారు. తిరుపతి నుంచి తిరుమలకు జనం అస్సలు వెళ్ళడం లేదు. అంతేకాదు 128 సంవత్సరాల తరువాత తిరుమల నిర్మానుష్యంగా మారిపోయింది. 
 
తిరుమల ఇలా కూడా ఉంటుందా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బాలాజీనగనర్ లోని స్థానికులు. అయితే మొదట్లో వారంరోజుల పాటు ఆలయంలో భక్తులను దర్సనానికి అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత వైరస్ ప్రబలతున్న నేపథ్యంలో ఈనెల 31వ తేదీ వరకని టిటిడి ఉన్నతాధికారులు ప్రకటించారు.
 
కానీ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. రోజు రోజుకు వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో పాటు ప్రజల్లో భయాందోళన కనిపిస్తుండడంతో మరికొన్ని రోజుల పాటు ఆలయాన్ని తెరిచి భక్తులను దర్సనానికి పంపించకూడదన్న నిర్ణయానికి టిటిడి వచ్చేసినట్లు తెలుస్తోంది.
 
ఏప్రిల్ 10వతేదీ వరకు దర్సనాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న నిర్ణయానికి టిటిడి ఉన్నతాధికారులు వచ్చేశారట. తిరుమల లాంటి ఆధ్మాత్మిక క్షేత్రంలో భక్తులను అనుమతించకుండా ఉండడం చాలా యేళ్ళ తరువాత ఇదే ప్రథమమట. గతంలో 1892వ సంవత్సరంలో ఆలయాన్ని మూసివేశారట. రెండురోజుల మాత్రమే ఆలయాన్ని మూసివేశారట.
 
ఆ తరువాత అంటే సరిగ్గా 128యేళ్ళ తరువాత ఇప్పుడే ఆలయాన్ని తెరిచి భక్తులను అనుమతించకపోవడం. ఈసారి ఇన్నిరోజులు భగవంతుడిని భక్తులకు దూరం చేయడం చరిత్రగా నిలిచిపోతుంది అంటున్నారు టిటిడి అధికారులు.