సోమవారం, 12 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శనివారం, 7 ఫిబ్రవరి 2015 (18:31 IST)

ఈశాన్య గదిని డైనింగ్ హాలుగా వాడవచ్చా..?

ఈశాన్య గదిని డైనింగ్ హాలుగా వాడవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈశాన్యమున వంటగది ఏర్పాటు చేస్తే ధన-ధాన్యములు హరించునని వారు హెచ్చరిస్తున్నారు. ఈశాన్యమున ఎలక్ట్రిక్ మీటర్‌లు వుండకూడదు.
 
ఈశాన్యభాగములో వాహనములకు పార్కింగ్ చేయకూడదు. ఇంటిపైన వేయు కప్పు ఈశాన్యమునకు వాలిన శుభములు కలుగును. ఈశాన్యములో ఆఫీస్‌గదిని నిర్మించుకొనుట శుభదాయకము. ఈశాన్య భాగములో వరండానుంచుట వలన శుభములు కలుగును. 
 
ఈశాన్యభాగమున ఎట్టి పరిస్థితుల్లోనూ మేడమెట్లు నిర్మించకూడదు. ఈశాన్యము నుండి వాడుక నీటిని బయటకు పంపు ఏర్పాటు చేసిన సకలశుభములు కులుగునని వాస్తు నిపుణులు అంటున్నారు.