బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:45 IST)

ఓ గృహాన్ని నిర్మించాలంటే..?

సాధారణంగా ఓ గృహాన్ని నిర్మించాలంటే.. వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.. గృహ నిర్మాణంలో లెంటల్లెవల్, సన్‌షేడ్ వేయునవుడు ఉత్తరం, తూర్పు గృహాలకు ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయాలు తెగిపోకుండా చూచుకోవాలి. గృహానికి పైకప్పు వేయునప్పుడు నైరుతి ఎత్తుగా ఉండి, వాయువ్యం కంటే ఆగ్నేయం ఎత్తుగా, ఈశాన్యం కంటే వాయువ్యం ఎత్తుగా ఉండునట్టు లెవెల్ సరిచేసుకోవాలి. 
 
ఇంటి అవసరాల కోసం గృహావరణలో గుంటలు గానీ చిన్నచిన్న మట్టి దిబ్బలు గానీ చేయరాదు. అలమారాలన్ని కూడా దక్షిణ, పశ్చిమ గోడలలోనే ఉండునట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఇక గృహ ద్వారాలు, కిటికీలు, ఉచ్ఛస్థానంలో ఉండునట్టు అమర్చుకోవాలి. ఇంట్లో ఏ గదులలో కూడా దిమ్మెలుగానీ, పూజా పీఠములు గానీ తూర్పు ఉత్తర ఈశాన్యములందు వేయకూడదు. 
 
గృహస్తుడు తను నివసిస్తున్న గృహానికి తూర్పు, ఉత్తర, ఈశాన్యంలో గల స్థలాలుగానీ, భవనాలుగానీ ఖరీదు చేయవలెను. ఇంటికి గల దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి స్థలాలను కొనకూడదు. పడకగదిలో తలను దక్షిణం వైపు ఉంచి నిద్రించునట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఏ సింహద్వార గృహమైనా, గృహం నిర్మించునపుడు దక్షిణ, పశ్చిమలు ఏక ఎత్తు పెట్టి, ఉత్తర, తూర్పుల యందు వసారాలు ఉంచి కట్టవలెను.