శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By chj
Last Modified: శుక్రవారం, 31 మార్చి 2017 (14:44 IST)

పూజగది ఎక్కడ పెట్టాలి? విగ్రహాలు ఎటు తిరిగి వుండాలి?

చాలామంది ఇళ్ళు కట్టేస్తుంటారు కానీ పూజ గది ఎక్కడ పెట్టాలో తెలియదు. కొంతమంది మేస్త్రీల మాట విని ఇంటిలో ఎక్కడపడితే అక్కడ పూజ గదిని పెట్టేస్తుంటారు. ఇదే అరిష్టమని చెబుతుంటారు పెద్దలు. అంతేకాదు ఒక్కోసారి సమస్యలు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు

చాలామంది ఇళ్ళు కట్టేస్తుంటారు కానీ పూజ గది ఎక్కడ పెట్టాలో తెలియదు. కొంతమంది మేస్త్రీల మాట విని ఇంటిలో ఎక్కడపడితే అక్కడ పూజ గదిని పెట్టేస్తుంటారు. ఇదే అరిష్టమని చెబుతుంటారు పెద్దలు. అంతేకాదు ఒక్కోసారి సమస్యలు కూడా వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అసలు పూజ గది ఎక్కడుండాలో తెలుసుకుందామా...
 
వాస్తు ప్రకారం చూస్తే దేవుళ్ళ విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. ఉదయం సూర్యకిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి ప్రసరిస్తాయి కాబట్టి. సాయంకాలంలో పడమర నుంచి కిరణాలు వస్తాయి. కాబట్టి విగ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కున అస్సలు పెట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్యంలోనే పూజ గదిని కూడా ఏర్పాటు చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.