శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (17:12 IST)

తినే వంటకు ఎన్ని రుచులో.. కట్టే ఇంటికి అన్ని రూపాలు..?

వేయి దీపాలుంటే వాస్తు ఉండదంటారు.. అది నిజమో కాదో తెలుసుకుందాం.. మన పెద్దల మాటల్లో వాస్తవం ఉంటుంది. కానీ దానిని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. అనేక గృహాలు నిర్మించినచోట అందరూ వాస్తు పాటించే ఉంటారు. కాబట్టి ఆ ప్రదేశంలో వాస్తుకు వుండే స్థలాలు ఉంటాయనే అర్థం ఉంటాయనే ఉద్దేశం ఉంటుంది. 
 
ఇదంతా ఒకనాటి సమిష్టి సంప్రదాయ నిర్మాణ పద్ధతి పాటించేకాలం నాటి మాట. నేడు అనేకులు అనేక రకాల గృహాలు తీరొక్క విధంగా కడుతున్నారు. అంతేకాదు, భూములు అస్తవ్యస్తంగా ఉన్నా అనేక గృహాలు నిర్మాణమవుతున్నాయి. ఇంటి నిర్మాణం ఇవాళ వ్యక్తిగతం. తినే వంటకు ఎన్ని రుచులు ఉంటాయో అదేవిధంగా కట్టే ఇంటికి అన్ని రూపాలు ఉంటున్నాయి. 
 
వాస్తు పాటించడం, పాటించకపోవడం అన్నది చట్టం కాదు కదా.. ఎవరికో నష్టమని కాదు. ఎందరికో ఇష్టమని కాదు.. ఎక్కే వాహనం ఏదైనా అది కండీషన్‌గా ఉండాలనేది ముఖ్యం. ఎవరి డ్రైవింగ్‌ను బట్టి వారివారి జీవితాలు లక్ష్యాన్ని చేరుతాయి.