బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (17:19 IST)

సక్సెస్ వాస్తు టిప్స్: వాయవ్య దిశగా కూర్చుని తింటే..?

సక్సెస్‌ అనేది అందరూ కోరుకునేదే. అలాంటి సక్సెస్ ఎప్పుడూ మీ వెంటే ఉండాలంటే.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంట్లోనూ, ఆఫీసులోనూ సక్సెస్ సాధించాలంటే.. పాజిటివ్ థింకింగ్‌తో పాటు గుడ్ వైబ్రేషన్స్‌ మిమ్మల్ని తాకేలా ఉండాలి. 
 
సక్సెస్‌కు ఉత్తర దిశ అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ దిశ పురోభివృద్ధికి సంకేతం. అందుచేత ఏదైనా కార్యం ప్రారంభించేటప్పుడు ఈ దిశవైపు తిరిగి ఆరంభించడం శ్రేయస్కరం. 
 
అలాగే ఉత్తరం, తూర్పు దిశల వైపు కూర్చుని తినడం, పనిచేయడం, టీవీలు చూడటం వంటివి చేయాలి. 
ఇక నిద్రించేటప్పుడు దక్షిణంవైపు తలపెట్టి ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. 
 
ఉత్తరం, తూర్పు దిశల్లో బాగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 
ఎప్పుడూ యజమానులు ఉత్తరం వైపు కూర్చుని పనిచేయాలి. 
అయితే పనివారలను ఉత్తరం వైపు కూర్చుని పనిచేయనివ్వకూడదు. 
 
పశ్చిమ, దక్షిణ దిశల్లో ఉంటే ఆ దిక్కుల్లో ఖాళీస్థలం వదిలిపెట్టరాదు. ఒక వేళ ముఖ ద్వారం పశ్చిమం లేదా దక్షిణ దిశల్లో ఉన్నట్టయితే, బాల్కనీలో ఖాళీ స్థలం వదిలిపెట్టరాదు. 
 
అలాగే తూర్పు, ఉత్తర దిశల్లో ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల సూర్యరశ్మి ఇంట్లో పడేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.