మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (18:01 IST)

వాస్తు టిప్స్ : నైరుతిలో హాలు ఉండవచ్చా?

వాస్తు ప్రకారం నైరుతి దిశలో హాలు ఉండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఒకవేళ హాలుగా ఉంటే దాన్ని బెడ్‌రూమ్ గానో లేక స్టోర్ రూమ్‌గానో మార్చుకోవచ్చును. 
 
* పడమర దిక్కున బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కిటికీలు గోడ అంచుకు బయటైనా, లోపలైనా లేదా మధ్యలోనైనా పెట్టుకోవచ్చు. 
 
* దక్షిణమున ఖాళీ స్థలమున్నట్లైతే నేలపై వాటర్ ట్యాంక్ నిర్మించుకోవచ్చు. నైరుతిలో కూడా నిర్మించుకుంటే ఎలాంటి దోషముండదు. 
 
* ఇంటికి పడమర లేదా పడమర వాయవ్యం దికుల్లో సింహద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు. పడమర ద్వారం ఏర్పాటు చేసుకున్నప్పుడు తూర్పువైపున కూడా ద్వారం ఏర్పరుచుకోవచ్చు. పడమర వీధిస్థలమైనప్పటికీ ఉత్తరం దిక్కున కూడా సింహద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు.