గురువారం, 8 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 15 మే 2015 (16:06 IST)

వాస్తు టిప్స్.. దాయాదులు రక్తసంబంధీకుల ఇళ్ళు ఎలా ఉండాలి?

దాయాదులు, రక్తసంబంధీకుల ఇళ్ళు పారుదప్పిన, తమ గృహాలకు కీడు చేయును. అట్లే వారి ఇంటి కూసాలు, తమ ఇంటిలోనికి చొచ్చుకొచ్చిన లేమి కలుగును. తన ఇంటికి తూర్పున పెద్దవాడు, దక్షిణాన చిన్నవాడు, పశ్చిమాన మధ్యవాడు అన్నదమ్ముల్లో జ్యేష్ఠుడు దక్షిణం వైపు ఉండాలి. 
 
వియ్యంకుడి ఇంటి వెన్నుగాడి, తన ఇంటితో కలిసినచో కీడు ఏర్పడును (అనగా పక్క పక్క నుండకూడదు). పొరుగువారి దీపపుకాంతి, తమ ఇంటిలోనికి ప్రసరించేలా ఉండరాదు. ఇతరుల ఇళ్ళ, వాకిళ్ళ, గోడల మూలలు తమ ఇంటి వాకిళ్ళలోనికి చొచ్చుకురాకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.