వాస్తు టిప్స్.. ఆ డబ్బాలో చిన్నపాటి అద్దాన్ని వుంచితే..?

Mirror
సెల్వి| Last Updated: శనివారం, 10 అక్టోబరు 2020 (13:18 IST)
Mirror
మహిళలు ఇంటి మహాలక్ష్ములు అంటారు పెద్దలు. వాస్తు ప్రకారం ఇంట సుఖసంతోషాలు చేకూరూరాలంటే.. మహిళలు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. సాయంత్రం సమయంలో దీపం వెలిగించిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు.

ఆరు గంటల తర్వాత మహిళలు స్నానం చేయకూడదు. వంట చేయడం అనేది అన్నపూర్ణమ్మను గౌరవించడంలో భాగం. అందుచేత స్నానానికి తర్వాతే వంట చేయడం మంచిది. వాస్తు ప్రకారం రాత్రి పూట లేదా సాయంత్రం ఆరు గంటలకు పైగా తల దువ్వడం చేయకూడదు.

ఇంట్లో వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఇంటికి నైరుతి దిశలో వుండకుండా చూసుకోవాలి. నైరుతి దిశలో నీటికి సంబంధించినవి వుండటం మంచిది కాదని.. అవి దారిద్ర్యాన్ని కొని తెస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.

ఇంట్లో బీరువాను ఉత్తర దిశగా వుంచడం ద్వారా ధనానికి అధిపతి అయిన కుబేరుని అనుగ్రహం పొందవచ్చు. ఇంకా ధనాదాయాన్ని పెంచేందుకు డబ్బు వుంచే పెట్టేలో ఓ చిన్నపాటి అద్దాన్ని వుంచాలి. ఇలా చేయడం ద్వారా ధనాదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :