ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 అక్టోబరు 2020 (12:08 IST)

ఇంటి చుట్టూ మొక్కలు వేస్తున్నారా? వాస్తు చూసుకుని వేస్తే మంచిది

వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయ. ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి.
 
ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు. ఎన్ని మొక్కలు నాటినా ఫలితం వుండదు. అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగటం ప్రారంభిస్తాయ. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్‌కి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటాలి.
 
ఏ రకమైన క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. ఈతచెట్టు, జిల్లేడు, తుమ్మ, తాటి, యూకలిప్టస్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచగూడదు. ఇంటి కాంపౌండ్ వాల్‌కి సుమారు ఆరడుగుల దూరంలో వీటిని పెంచుకోవచ్చు. బిల్వ పత్రం చెట్టును పెంచేవారు దాని మొదట్లో చిన్న శివలింగాన్ని వుంచితే ఆ ఇంటికేవన్నా తెలీని వాస్తు దోషాలుంటే అవి మటు మాయమవుతాయ. పొలాల్లో ఎటువంటి మొక్కలను పెంచాలనుకున్నా పొలంగట్టుకి తగలకుండా పెంచాలి.