రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో?
శ్రీలక్ష్మీ దేవిని సంపద, శ్రేయస్సుకు అధి దేవతగా భావిస్తారు. నేటి యుగంలో ప్రతి వ్యక్తికి డబ్బు చాలా అవసరం. కాబట్టి, ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. దీనికోసం వారు వివిధ మార్గాల్లో లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఆమె అనుగ్రహం పొందాలనుకుంటే.. ఆ లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఎల్లప్పుడూ ధర్మశక్తిని కలిగి ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు సంపద, శాంతి, ఆనందంతో నిండి ఉంటుంది.
ఇంకా రాత్రి పడుకునే ముందు మహిళలు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఇంట్లో ఉంటాయని నమ్ముతారు. స్త్రీలు రాత్రి పడుకునే ముందు చేతులు, కాళ్ళు కడుక్కోవాలి, కొద్దిసేపు తమ ఇష్ట దైవాన్ని తలచుకుంటూ, ఆ తర్వాతే నిద్రపోవాలి.
సనాతన ధర్మం ప్రకారం, ఇంట్లో స్త్రీలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అందువల్ల రాత్రి పడుకునే ముందు పూజ గదిలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించే ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. డబ్బుకు కొరత ఉండదు.
మహిళలు రాత్రి పడుకునే ముందు, కర్పూరం వెలిగించి, దాని పొగను బెడ్ రూమ్‌తో సహా ఇల్లు అంతటా వ్యాపింపజేయాలి. మీరు దీనికి రెండు లవంగాలను కూడా జోడించవచ్చు. ఈ కర్పూరం.. లవంగాస పొగ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. పడకగదిలో కర్పూరం వెలిగించడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి ప్రేమ, ఆప్యాయత పెరుగుతుంది. తద్వారా శ్రేయస్సు ఆ ఇంట వెల్లివిరిస్తుంది.
రాత్రి పడుకునే ముందు, ఇంటి యజమాని దక్షిణ దిశలో ఆవ నూనె దీపం వెలిగించాలి. దక్షిణ దిశను పూర్వీకుల దిశగా భావిస్తారు కాబట్టి, ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది కాకుండా, మీరు ఈ దిశలో ఒక బల్బును ఉంచవచ్చు. సాయంత్రం వేళల్లో వెలిగించాలి. అదేవిధంగా, ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.