శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (23:34 IST)

పదే నిమిషాలు.. అటుకుల పొంగలి చేసేద్దాం..

పొద్దున్నే హడావుడిగా ఏదో టిఫిన్ చేస్తున్నారా.. అలాంటి వారు మీరైతే అటుకులతో సింపుల్‌గా పొంగలి ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసినవి : అటుకులు - 1 కప్పు, పెసర పప్పు - 1/4 కప్పు, బొప్పాయి పొడి - కొద్దిగా నూనె, నెయ్యి - మిరియాలు, జీలకర్ర - కొద్దిగా పచ్చిమిర్చి - 2 అల్లం - 1 ముక్క కరివేపాకు, కొత్తిమీర తరుగు - కొద్దిగా ఉప్పు - కావలసినంత
 
విధానం: మిరపకాయలు, అల్లం, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కుక్కర్‌లో పప్పు వేసి ఒక విజిల్ వచ్చాక దించేయాలి. కడాయిలో నెయ్యి పోసి కాగగానే మిరియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత అటుకులు వేసి కలపాలి. 
 
తర్వాత ఉడికించిన పప్పు, పోపు పొడి, ఉప్పుతో పాటు తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. అంతే   పొంగలిలా వచ్చాక కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే అటుకుల పొంగలి రెడీ.