ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (15:19 IST)

లైంగిక శక్తిని పెంచే లేతకొబ్బరి డిలైట్ ఎలా చేయాలంటే..?

Coconut delight
Coconut delight
లేత కొబ్బరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇందులో పుష్కలంగా పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా వుంచుతుంది. తద్వారా ఇది బరువును తగ్గిస్తుంది. అంతేగాకుండా లైంగిక శక్తిని పెంచేందుకు, స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు లేత కొబ్బరిలో ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
కావలసినవి : 
సన్నగా తరిగిన లేత కొబ్బరి - ఒక కప్పు, 
పాలు - 3 కప్పులు,
పంచదార - 2 టేబుల్ స్పూన్లు, 
కొబ్బరి పాలు - ఒక కప్పు
 
తయారీ విధానం: పాలలో పంచదార వేసి మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత చల్లారనివ్వాలి. పాలు బాగా చల్లారిన తర్వాత అందులో సన్నగా తరిగిన లేతకొబ్బరి, కొబ్బరి పాలు వేసి 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి. అంతే సూపర్ టేస్టీతో లేత కొబ్బరి డిలైట్ రెడీ అయినట్లే.