సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 7 జులై 2022 (22:39 IST)

చింతచిగురు పప్పు ఎలా చేయాలి?

తొలకరి జల్లులు పలుకరించగానే చింతచిగురు కూడా వచ్చేస్తుంది. చింతచిగురుతో పలు వంటకాలను రుచికరంగా చేసుకోవచ్చు. చింతచిగురు-పప్పు ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఏమిటంటే... పచ్చికారం 2 చెంచాలు, ఉప్పు పసుపు తగినంత, పచ్చిమిర్చి, కందిపప్పు అరకిలో, ఎండుమిర్చి 4, చింతచిగురు 200 గ్రాములు, ఒక ఉల్లిపాయ.

 
ఎలా తయారు చేసుకోవాలంటే..  ఉల్లిపాయ, మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కందిపప్పు మెత్తగా ఉడికించాలి. చింతచిగురును పప్పులో వేసి, దానితో పాటు ఉల్లి, మిర్చి కూడా వేసి మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత పసుపు, కారం వేయాలి. ఆ తర్వాత పప్పు, చింతచిగురు అంతా కలిపి పాత్రలో బాగా మెత్తగా మెదపాలి. మరో పాత్ర తీసుకుని అందులో కాస్త నూనె వేసి తిరగమోతగింజలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి. అంతే... పప్పు-చింతచిగురు కూర రెడీ.