గురువారం, 23 మార్చి 2023
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సిహెచ్
Last Modified గురువారం, 12 మే 2022 (13:42 IST)

టేస్టీటేస్టీగా బాదం రైస్, ఎలా తయారు చేయాలి?

Almonds
బాదంరైస్. పిల్లలకి రుచికరమైన వంటకాలలో ఇది ఒకటి. ఈ బాదం రైస్ కోసం కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం.

 
3 కప్పులు బాదం పాలు
1 కప్పు బియ్యం
1/4 కప్పు చక్కెర
1 టీస్పూన్ వెనీల్లా
1/4 టీస్పూన్ బాదం సారం
రుచికి దాల్చినచెక్క
1/4 కప్పు వేయించిన బాదం పప్పు

 
తయారుచేసే విధానం:
నీటితో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బాదం పాలు, బియ్యం కలిపి మరిగించండి. సన్నటి సెగపైన అన్నం ఉడికేవరకూ వరకు మూత పెట్టి 30 నుండి 45 నిమిషాలు అలా స్టవ్ పైన వుంచాలి. అన్నం ఉడికిన తర్వాత దానికి చక్కెర, వెనిల్లా, బాదం సారం, దాల్చినచెక్క జోడించండి. అంతా కలియదిప్పి కిందకు దించేయండి. అంతే... వేడివేడిగా సర్వ్ చేసేయవచ్చు.