శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మే 2016 (18:07 IST)

సమ్మర్ స్పెషల్ : కంటికి మేలు చేసే క్యారెట్ గీర్ ఎలా చేయాలి?

గుండె సమస్యలు, చెడు కొలెస్ట్రాల్, కేన్సర్‌కు చెక్ పెట్టాలంటే క్యారెట్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. క్యారెట్‌ను ఆహారంలో ఉడికించి తీసుకోకుండా సూప్, జ్యూస్‌ల రూపంలో తీసుకోవాలి. పిల్లలు క్యారెట్‌ను తీసుకోకుండా మారాం చేస్తే.. వాళ్లకి నచ్చే విధంగా క్యారెట్ గీర్ ట్రై చేసి సర్వ్ చేయండి. అదెలా చేయాలంటే..  
 
కావలసిన పదార్థాలు : 
క్యారెట్: అరకేజీ 
కొబ్బరి : ఒకటి 
పంచదార : వంద గ్రాములు 
యాలకుల పొడి : ఒక టీ స్పూన్ 
పచ్చ కర్పూరం : నాలుగు చిటికెలు
 
తయారీ విధానం : క్యారెట్ తురుమును మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఆ జ్యూస్‌లో కొబ్బరి పాలు, పంచదార కలుపుకోవాలి. ఇంకా వాసన కోసం యాలకుల పొడి, పచ్చకర్పూరం చేర్చుకుని సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకుని టేస్టే చేస్తే ఆ రుచి అదిరిపోతుంది.