గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (14:35 IST)

కోడిగుడ్లతో బ్రెస్ట్ కేన్సర్‌కు చెక్?

గుడ్లు వంటి బలవర్థక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాధి నివారణ అధ్యయానికి దాదాపు 3 వేలమంది మహిళలను ఎంచుకున్నారు. బి కాంప్లెక్స

గుడ్లు వంటి బలవర్థక ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వ్యాధి నివారణ అధ్యయానికి దాదాపు 3 వేలమంది మహిళలను ఎంచుకున్నారు. బి కాంప్లెక్స్ విటమిన్‌ను కలిగియుంటే కోలైన్ పదార్థం ఎక్కువగా ఉండే గుడ్లను ఆహారంలో తీసుకుంటే ఈ వ్యాధి కనీసం 24 శాతం తగ్గిపోయేందుకు సహాయపడుతుంది. కోలైన్ పదార్థాన్ని అధికంగా తీసుకున్న మహిళలు రోజుకు 455 మిల్లీ గ్రాముల కోలైన్‌ను వినియోగించాలి.
 
అందుకు కాఫీ, గుడ్లు, స్కిమ్‌మిల్క్ వంటి వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిది. కణాలు సాధారణ రీతిలో పనిచేసేందుకు కోలైన్ చాలా అవసరం. వయసు, లింగంతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ కోలైన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవచ్చును. మహిళలకు ప్రత్యేకించి పిల్లలను పెంచే వయస్సులో ఉన్న మహిళలకు కోలైన్ చాలా అవసరమని పరిశోధనలో పేర్కొన్నారు.
 
గుడ్డును రోజు తీసుకుంటే అందులో 125.5 మిల్లీ గ్రాముల కోలైన్ ఉంటుంది. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో గుడ్డు చాలా ఉపయోగపడుతుంది. గుడ్డులోని పచ్చసొనలో కోలైన అధికంగా ఉంటుంది. ఇకపోతే కాలేయం, గోధుమ మెులకలు, కాలిఫ్లవర్స్‌లో కూడా తగుమాత్రంలో కోలైన్ ఉంటుంది. 
 
కణాలు సాధారణ పనితీరులో కోలైన్ కీలక పాత్ర వహించడమే కాకుండా మెదడు, నరాలు, కాలేయ జీవ రసాయన ప్రక్రియ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా శరీరంమంతటా పోషకపదార్థాలను సరఫరా చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడమే కాకుండా మన జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తుంది.