1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 జులై 2015 (16:29 IST)

మరక మంచిదే... చక్కెరతో పోతుంది..

తియ్యగా నోటికి మంచి రుచిని అందించే చక్కరె ఆహార పదార్థాల్లోకి మాత్రమే కాదు, మరకలను పోగొట్టేందుకు కూడా బాగా ఉపకరిస్తుంది. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నట్టైతే నేల మీద గోళ్ల రంగూ, మందు సిరప్‌ల వంటి మరకలు పడుతుంటాయి కదా! వాటిని చక్కెరతో సులువుగా వదిలించవచ్చు. వెనిగర్‌లో చక్కెర కలిపి, అది కరిగాక అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. పావుగంటయ్యాక వాటితో తుడిచి, నీళ్లతో శుభ్రం చేస్తే మరకలు మాయమవుతాయి.
 
అదేవిధంగా అరకప్పు గులాబీ నీళ్లలో నాలుగైదు చెంచాల చక్కెర వేసి కరిగే వరకూ చెంచాతో తిప్పాలి. ఈ నీళ్లతో వెండి వస్తువుల్ని తోమితే కనిపించని దుమ్మూ, మురికీ వదిలిపోతాయి. అలాగే పావు కప్పు నిమ్మరసంతో మూడు చెంచాల చక్కెర కలిపి, అది కరిగాక తుప్పు మరకలు అంటిన చోట చల్లి స్పాంజితో తుడిస్తే అవి వదిలిపోతాయి. దుస్తుల మీద పడిన తప్పుడు మరకల్ని ఈ మిశ్రమంతో వదిలించడం సులువే.