ఇంట్లోని టీవీని ఎలా శుభ్రం చేస్తున్నారు?
చాలామందికి టీవీని ఎలా శుభ్రం చేయాలో తెలీక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం కొన్ని చిట్కాలు..
టీవీని శుభ్రం చేసే ముందు ఆఫ్ చేయాలి. దీంతో మురికి ఎక్కడ ఉందో స్పష్టంగాకనిపిస్తుంది. పొడిగా ఉండే మెత్తటి క్లాత్‌ను తీసుకొని, ముందు దుమ్ము తుడవాలి. ఎక్కువ ఒత్తిడి లేకుండా పై నుంచి కిందకు తుడవాలి. వెనిగర్, నీళ్లు సమభాగాలు తీసుకొని దీంట్లో మెత్తటి క్లాత్ ముంచి, పిండి దాంతో స్క్రీన్‌ను తుడవాలి. ఆ తర్వాత పొడి క్లాత్‌తో తుడవాలి.
పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్స్, షర్ట్ క్లాత్స్‌ను స్క్రీన్ తుడవడానికి ఉపయోగించకూడదు. అమ్మోనియా, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటోన్ వంటి రసాయనాలతో స్క్రీన్ తుడిస్తే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
లిక్విడ్స్ ఏ మాత్రం డెరైక్ట్‌గా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు. స్ప్రే మానిటర్ లోపలికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో త్వరగా స్క్రీన్ పాడయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే మీ టీవీ స్క్రీన్ మరింతకాలం పని చేస్తుంది.