బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 3 జులై 2017 (18:17 IST)

ఫ్రిజ్ వాడకంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటి?

ఫ్రిజ్‌లో ఆహారపదార్ధాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు. ప్రిజ్ లోపల గాలి ప్రవేశించేలా ఖాళీ వుండేలా చూడాలి. సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా వేసి కవర్లో పెట్టాలి. కూరగాయలను కడిగ

ఫ్రిజ్‌లో ఆహారపదార్ధాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు. ప్రిజ్ లోపల గాలి ప్రవేశించేలా ఖాళీ వుండేలా చూడాలి.
 
సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా వేసి కవర్లో పెట్టాలి.
 
కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి. మిరపకాయలను ఫ్రిజ్‌లో పెట్టేముందు వాటి తొడిమలను తొలిగించకూడదు.
 
తొడిమలు తీసిన మిరపకాయలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బిన పిండి లాంటివి ఫ్రిజ్‌లో ఉంచినపుడు వాటి మీద మూత పెట్టాలి. 
 
ఆకుకూరల వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరపెట్టి కట్లను విడదీసి పాలథిన్ కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. వేడి ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
 
ఫ్రిజ్ తలుపులను ఎక్కువసార్లు తీస్తువేస్తు ఉండటం, ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వలన ఫ్రిజ్ త్వరగా పాడైపోతుంది. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కండెన్సర్ మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేయాలి. నెలకు రెండుసార్లు డీప్రాస్ట్ చేసి ఫ్రిజ్ లోపల శుభ్రం చేసి, బయట కూడా మరకలు, దుమ్ము లేకుండా తుడవాలి. ఫ్రిజ్‌లో పాలు, పెరుగు లాంటివి ఒలికితే ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ చేసి శుభ్రం చేసుకోవాలి.