శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 9 మే 2019 (20:19 IST)

ఎంత ప్లాన్ చేసినా.. డబ్బంతా ఆవిరైపోతుందా?

ఎంత ప్లాన్ చేసుకున్నా.. నెలాఖరువచ్చేసరికి డబ్బంతా ఆవిరి అయిపోతుందా..? అయితే పొదుపు చర్యలు పాటించండి. ప్రతినెలా ఆర్థికంగా స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నా దాన్ని తు.చ. తప్పకుండా పాటించడం అనేది దాదాపు ఎవరికీ సాధ్యపడదు. ఐతే వీలైనంతవరకు అనుసరించడానికి ప్రయత్నిస్తే కొంత ఫలితం ఉంటుంది. 
 
ఆదాయానికంటే తక్కువగా ఖర్చు చేయడం తొలి సూత్రం. షాపింగ్‌తు వెళ్ళడం అలవాటుంటే అనవసర వస్తువుల్ని కొనుక్కోవడం నియంత్రించాలి. క్రెడిట్ కార్డులు విరివిగా ఖర్చు చేయడం మానండి. పర్సులో అవసరం మేర డబ్బు వుంచండి. ఫోన్ బిల్లులపై కన్నేసి ఉంచండి. కరెంట్ అనవసర వినియోగాన్ని తగ్గించండి.
 
చాలామంది అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు వేసి అలాగే వదిలేసి, ఇతర పనుల్లో నిమగ్నం అవుతుంటారు. ఆయా గదుల్లో పని లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు కట్టేయండి. అన్నింటికంటే ప్రధాన విషయం చేతిలో డబ్బు ఉందని ఖర్చు చేసేయకండి. అదనంగా ఉన్న వాటిని పక్కనబెట్టే అలవాటున్న వారు దాదాపుగా వృధా ఖర్చుల జోలికి ఏనాడూ వెళ్ళరు.