గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మే 2023 (11:25 IST)

అన్నీ రోజులూ ఒకేలా వుండదు.. మహిళలు ఇలా ప్లాన్ చేస్తే..?

Working Woman
Working Woman
మహిళలు ప్రస్తుతం అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. గృహిణీగా, ఉద్యోగినిగా, తల్లిగా వివిధ రూపాల్లో మహిళ రాణిస్తోంది. అయితే మహిళలు శారీరకంగా తీవ్రంగా శ్రమించడం కంటే.. కాస్త తెలివిగా పనులను పూర్తి చేసుకోవడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. 
 
ఇలా రోజువారీ పనులను సింపుల్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఏ పని చేసినా ఇష్టపడి చేయాలి. కష్టపడి చేయకూడదు. ఇది చేసే పనిని సులభంగా.. సక్సెస్‌గా ముగించేందుకు ఉపయోగపడుతుంది. ప్రాధాన్యత ప్రకారం పనులను చేయడం చేయాలి. 
 
సులభమైన పనులను ముందుగా ముగించాలి. ఎక్కువ సమయం తీసుకునే పనులను కొంత సమయం గ్యాప్ తీసుకుని చేయాలి. పనులు సజావుగా పూర్తి కావడానికి ప్రణాళిక అవసరం. అలాలో, షెడ్యూలింగ్ పనుల కోసం సమయాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. అనుసరించగలిగే ప్రణాళికలను మాత్రమే రూపొందించుకోవాలి. 
 
టాస్క్‌లకు ప్రాధాన్యతనిస్తూ, ప్లాన్ చేస్తూ, సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్తే అన్నీ పనులు పూర్తవుతాయి.  చేయాల్సిన పని వివరాలు అర్థం కానప్పుడు, వాటిని స్పష్టం చేయమని సంబంధిత వ్యక్తిని అడిగి తెలుసుకుని చేయడం మంచిది. అవగాహన లేకుండా పని చేస్తే, సమయం వృధా అవుతుంది. అది సక్సెస్ అవుతుంది. 
 
అలాగే అనవసరమైన సమావేశాలు, చర్చలు మొదలైన వాటికి దూరంగా ఉండటం వల్ల సమయం ఆదా అవుతుంది. అన్నీ రోజులూ ఒకేలా చేయడం కష్టం. అందుచేత శారీరర శక్తికి ఆధారంగా పనులను కేటాయించుకోవడం చేయాలి. ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే అన్నీ పనులు సులభమవుతాయి. ఒత్తిడి కూడా దూరమవుతుంది.