శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (13:32 IST)

అమ్మాయిలు అందంగా ఉండాలి.. అబ్బాయిలు నిజాయితీగా ఉండాలి.. అమితాబ్, షారూఖ్‌లా?

జెన్ ఎక్స్ (అబోవ్ 30) పేరిట ఓ మ్యాట్రీమోన సంస్థ వ్యక్తుల అభిప్రాయాలను సేకరించాలని భావించింది. తమకు వచ్చే భాగస్వామి ఎలా ఉండాలనే అంశంపై 30 ఏళ్లు పైబడిన వ్యక్తుల వద్ద సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు తె

జెన్ ఎక్స్ (అబోవ్ 30) పేరిట ఓ  మ్యాట్రీమోన సంస్థ వ్యక్తుల అభిప్రాయాలను సేకరించాలని భావించింది. తమకు వచ్చే భాగస్వామి ఎలా ఉండాలనే అంశంపై 30 ఏళ్లు పైబడిన వ్యక్తుల వద్ద సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ కూడా అయ్యింది. అబ్బాయిల్లో అమ్మాయిలు ఎదురుచూసేది నిజాయితీనే. కానీ అబ్బాయిలు మాత్రం అందం, గౌరవం, కష్టపడే తత్వాన్ని అమ్మాయిల నుంచి కోరుకుంటామని యువతరం వెల్లడించారు. 
 
అదీ సదరు మాట్రీమోనీ సంస్థ తమ కోరికలకు అనుగుణంగా సరితూగే సెలబ్రిటీని ఎంచుకుని మరీ తమ అభిప్రాయం వెల్లడించాల్సిందిగా సూచించింది. కేవలం రెండుగంటల్లోనే 1500 మంది యువతీయువకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో నమోదు చేశారు. తమ జీవిత భాగస్వామి నిజాయితీగా ఉండాలని అమ్మాయిలు కోరుకుంటుంటే.. అబ్బాయిలు మాత్రం అందమే ముఖ్యమని చెప్తున్నారు. అర్థం చేసుకునే అమ్మాయిలే కావాలని యువతీయువకులు కోరుకుంటున్నారు. తమకు కాబోయే వారు సంఘంలో గౌరవ ప్రదంగా ఉండాలని యువతరం భావిస్తోంది. 
 
అదెలా అంటే అమితాబ్‌ బచ్చన్‌లా అనే సమాధానమూ ఇస్తోంది. 50శాతం మంది అమితాబ్‌లా ఉండాలనుకుంటే తరువాత షారూఖ్‌ ఖాన్‌ (40శాతం ), సల్మాన్‌ఖాన్‌ (10శాతం) ఉన్నారు. కేవలం అమ్మాయిలనే తీసుకుంటే 40 శాతం మంది గౌరవం పరంగా షారూఖ్‌ఖాన్‌ లాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు.
 
ఈ సర్వేలో భాగంగా యువతలో 55శాతం మంది షారూఖ్‌ఖాన్‌ని మించిన నిజాయితీపరుడు లేడంటున్నారు. అనుసరించి అజయ్‌ దేవగన్‌ (30శాతం ), ఎంఎస్‌ ధోనీ (15శాతం) ఉన్నారు. అయితే ధోనీ నిజాయితీని మెచ్చుకుంటున్న అబ్బాయిలు ఒక శాతం కన్నా తక్కువగా ఉండటం గమనార్హం.
 
అందానికి అబ్బాయిలే కాదు అమ్మాయిలూ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందమంటే హృతిక్‌ రోషన్‌దేనని 70 శాతం మంది చెప్పగా, అమీర్‌ఖాన్‌లా కష్టపడాలని 50శాతం మంది అమ్మాయిలు చెప్తున్నారు. కష్టమంటే అక్షయ్‌దేనని 14 శాతం అబ్బాయిలు ఓటేస్తున్నారు.