శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:11 IST)

కోపాన్ని తగ్గించాలంటే.. ఏం చేయాలి..?

మీకు తరచూ కోపం వస్తుంటే శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పుడు శరీరంలో ఎడ్రినలీన్ రసాయనం విడుదలవుతుంది. ఇది శరీరంలో దాదాపు 18 గంటలవరకు ఉంటుందంటున్నారు వైద్యులు. దీంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. కోపాన్ని తగ్గించుకుంటే అందంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోపం వలన అనారోగ్యం పెరుగుతుంది.
 
ఈ రసాయనాన్ని మీరు శరీరంలో నుండి తొలగించాలంటే వ్యాయామం చేయాలి. దీనికి పగటిపూట సమయం (ఉదయం పూటైతే మరీ మంచిది) కేటాయించాలి.. లేదా వేగంగా నడక ప్రారంభించాలి. ఇలా అరగంటపాటు చేయాలి. మీరు కోపంగా ఉన్నప్పుడు ఇలా చేయండి. దీంతో కోపం నుండి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. కోపం వచ్చినప్పుడు బిగ్గరగా అరవకండి. అంకెలను వంద వరకు ఎంచండి. ఆ తర్వాత పదిసార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. కోపం వచ్చినప్పుడు అలా వ్యాహాళికోసం బయటకు వెళ్ళాలి.
 
మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. ఒక గ్లాస్ చల్లటి నీటిని సేవించండి. చెదిరిన మీ ముంగురులను ఓ సారి సరిచేసుకునేందుకు అద్దం ముందుకు రండి. మీ ముఖాకృతిని అద్దంలో బాగా పరిశీలించండి. దీంతో మీ కోపం తగ్గిపోతుంది. కోపం కలిగినప్పుడు ప్రశాంతంగా సంగీతం వినండి. ఏ విషయమైతే మీకు కోపం కలిగించిందో దానిని ఇతరులతో మాట్లాడుతూ మరిచిపోవడానికి ప్రయత్నించండి. మీకు యోగా చేయడం వస్తే దానిని చేయడం ప్రారంభించండి.