రోజ్‌వాటర్‌ను తలకు పట్టింటి..?
రోజాపువ్వు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. దాని సువాసన కూడా అంతే అందంగా ఉంటుంది. అలానే ఈ పువ్వులతో తయారుచేసిన రోజ్‌వాటర్ మరింత వాసనతో వెదజల్లుతుంది. ఇలాంటి రోజ్‌వాటర్‌ను శరీరానికి ఉపయోగిస్తే.. ఏర్పడే ఫలితాలు తెలుసుకుందాం..
1. రోజ్‌వాటర్ ఉంటే మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని సౌందర్యంగా మార్చుతాయి. అలానే ఈ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు చర్మంలోని కణాలని పరిపుష్టం చేయడంతోపాటు చర్మంలో ఉండే టిష్యుల పునరుత్పత్తికి ఉపయోగపడుతాయి.
2. ఇప్పటి వేసవికాలంలో ఎండ ప్రభావం వలన వచ్చే చర్మ సమస్యలకు రోజ్‌వాటర్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాస్త రోజ్‌వాటర్ ముఖానికి రాసుకుని ఓ 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కుంటే చర్మం కమిలిపోకుండా ఉంటుంది.
3. జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. రోజ్‌వాటర్‌ను తలకు పట్టింటి.. అరగంట తరువాత వెచ్చని నీటితో తలస్నానంచేయాలి. ఇలా వారంలో ఒక్కసారి చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది. అలానే చుండ్రుకు కూడా చెక్ పెడుతుంది.