గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:50 IST)

టమోటా గుజ్జు, పెరుగుతో ఫేస్‌ప్యాక్..?

వేసవి అధికంగా ఉండడం వలన చర్మం కమిలిపోతుంది. దాంతో ముఖం, చేతులపై సూర్యకిరణాలు పడి చర్మంలో కాస్త తేడా వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు స్కిన్ టాన్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చర్మం కమిలిపోకుండా మనం ఇంట్లోనే చేసుకునే ఫేస్‌ప్యాక్‌లేంటో తెలుసుకుందాం..
 
విరివిగా కూరల్లో వాడుకునే టమోటా అందానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సన్‌టాన్‌ని తొలగించడంలో టమోటా ముఖ్యపాత్ర పోషిస్తుంది. టమోటాను గుజ్జుగా చేసి అందులో కొద్దిగా పెరుగు, ఓట్స్ పిండి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
కలబంద చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎండకు వాడిపోయిన చర్మానికి చక్కని గ్లో తెస్తుంది. డైరెక్ట్‌గా కలబంద రసాన్ని ముఖానికి రాసుకోవాలి. ఎండకు కమిలిన చర్మానికి మునుపటి అందం తీసుకువస్తుంది. బయట నుండి వచ్చాక ఫేస్‌ని చన్నీళ్లతో శుభ్రపరచుకున్న తర్వాతనే ఈ ఫేస్‌ప్యాక్స్ వేసుకోవాలి.