బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:46 IST)

ఓట్స్, పెరుగు ముఖానికి పట్టిస్తే..?

వింటర్ స్పెషల్‌.. శీతాకాలానికి తగ్గట్లు చర్మానికి అందాన్ని చేకూర్చాలంటే.. శాండిల్, ఓట్ మీల్ ప్యాక్ ట్రై చేయండి. ఒక స్పూన్ గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, అరస్పూన్ పసుపు తీసుకుని ఈ మూడింటిని కలిపి ముఖానకి అప్లై చేసి 30 నిమిషాల తరువాత చల్లటినీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై నలుపు తొలగి చర్మం తాజాగా వుంటుంది. 
 
అలాగే ఓట్ మీల్ ప్యాక్.. 3 స్పూన్ల ఓట్‌మీల్, 1 ఎగ్ వైట్, 1 టీస్పూన్ తేనె, 1 టీ స్పూన్ పెరుగును బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరాక కడిగేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది. 
 
పాలలో కొద్దిగా వంటసోడా కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం తాజాగా మారుతుంది. కప్పు కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు, స్పూన్ గుడ్డుసొన కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. ముఖచర్మం తేమగా తయారవుతుంది.
 
పసుపులో కొద్దిగా రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. పావుగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.