శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-06-2020 శనివారం మీ రాశి ఫలితాలు.. అనంత పద్మనాభ స్వామిని...?

అనంత పద్మనాభ స్వామిని పూజించినా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: ప్రణాళికబద్ధంగా శ్రమించి మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీలకు బంధువర్గాలతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు మంజూరవుతాయి.
 
వృషభం: ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ మాటకు సంఘంలో మంచి స్పందన లభిస్తుంది. విద్యార్థులకు టెక్నికల్ రంగంలో అవకాశాలు లభిస్తాయి.
 
మిథునం: స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారు నిరుత్సాహానికి లోనవుతాపు. చెప్పుడు మాటల ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ ఆలోచనలు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం వుంది.
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత నెలకొంటుంది. విందులు, వినోదాలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
సింహం: స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ప్రేమికులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా మాటపడవలసివస్తుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కన్య: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆస్తి పంపకాల్లో పెద్దల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు.
 
తుల: ఆర్థికంగా పురోగమించటానికి చేయు ప్రయత్నాలు కలిసివస్తాయి. మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి.
 
వృశ్చికం: కొత్తగా చేపట్టిన వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, కలహాలు తలెత్తుతాయి. ప్రముఖులను, మిత్రులను కలుసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. క్లిష్ట సమయంలో బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 
 
ధనస్సు: ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వైద్య రంగంలోని వారు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
మకరం: బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. రాజీ ధోరణితో వ్యవహరించడం వల్ల ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. పాత బిల్లులు చెల్లిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
కుంభం: శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ అవసరాలకు సరిపడా ధనం సమకూర్చుకుంటారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా రాబడి ఆశించినంతగా ఉండదు. 
 
మీనం: విందులు, వినోదాల్లో మీ బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది.