ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-10-2021 ఆదివారం దినఫలాలు .. అమ్మవారిని చామంతులతో

మేషం:- ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసిరాగలవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, రాత పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం:- స్త్రీలకు బంధు వర్గాలతో సఖ్యత, చుట్టు పక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో సమస్యలు తలెత్తుతాయి. తరచు రుణయత్నాలు చేస్తుంటారు.
 
మిథునం:- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కపటంలేనిమీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ఉపాధిపథకాలపై నిరుద్యోగులు దృష్టి సారిస్తారు. ఆత్మీయులకు ఒక ముఖ్య సమాచారం అందించట వల్ల మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు.
 
కర్కాటకం:- దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తి, ప్రయోజనం పొందుతారు.
 
సింహం:- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మిమ్ములను చూసి అసూయపడే వారు అధికమవుతారు. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన కుటుంబ అవసరాలు ఆందోళన కలిగిస్తాయి.
 
కన్య:- చిరు వ్యాపారులకు, చిన్నతరహా పరిశ్రమల వారికి కలిసిరాగలదు. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. బంధువులను, ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
 
తుల:- వ్యాపారాభివృద్ధికి చేయు కృషి సత్ఫలితాలనిస్తుంది. మీ కళత్ర ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు గురిచేస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
వృశ్చికం:- భాగస్వామిక చర్చలు అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరదు. వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమయానికి మిత్రులు సహకరించకపోవటంతో అసహనానికి గురవుతారు.
 
ధనస్సు:- అకాల భోజనం, శ్రమాధిక్త వల్ల స్వల్ప అస్వస్థకు గురవుతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరదు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. 
 
మకరం:- మీ మాటకు సంఘంలో గౌరవం లభిస్తుంది. ఖర్చులు పెరగటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. స్త్రీలు వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల నుంచి స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కుంటారు.
 
కుంభం:- స్త్రీలు దైవ, శుభ కార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఖాతాదారులతో చికాకులు తప్పవు. భాగస్వామిక చర్చలు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదుర్కుంటారు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి.
 
మీనం:- ఉమ్మడి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. స్త్రీలు దైవ, శుభ కార్యాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. సమయానికి మిత్రులు సహకరించకపోవటంతో అసహనానికి గురవుతారు.