ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (16:45 IST)

08-09-2024 నుంచి 14-09-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. స్వయంకృషితో లక్ష్మాన్ని సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులు అనుకూలించవు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పు అనివార్యం. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగపరంగా శుభఫలితాలున్నాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవకార్యం, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వాయిదా చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన పనులు మాత్రమే చేపట్టండి. ఉద్యోగస్తుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం విశేషమైన ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పెద్దల సలహా పాటించండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పాతపరిచయస్తులను కలుసుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు అనుకూలించవు. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుంటారు. సోమ, మంగళవారాల్లో పనులు అప్పగించవద్దు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒత్తిళ్లకు గురికావద్దు. ప్రశాంతంగా గడపటానికి యత్నించండి. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం మంచిది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులు కలిసిరావు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గురువారం నాడు ఆచితూచి అడుగేయాలి. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా పాటిచంచండి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాతపరిచయస్తులతో సంభాషిస్తారు. గత సంఘటనలు ఉల్లాసపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు నిరాశాజనకం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. భేషజాలకు పోయి ఇబ్బందులకు గురవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర విషయాల జోలికి పోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పువస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సర్వత్రా మీదే పైచేయి. మీ చిత్తశుది అందరినీ ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. చేతిలో ధనం నిలవదు. శుక్ర, శనివారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆప్తుల ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంతానానికి శుభయోగం. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి లాభసాటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. అతిగా శ్రమించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగల్గుతారు. సోమవారం నాడు ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు కొనసాగిస్తారు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనులున్నాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగపరంగా ఆశించిన మార్పులుంటాయి. పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో పెద్దల సలహా తీసుకుంటారు. మంగళవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో పురోగమిస్తారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీదైన రంగాల్లో ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్త వహించండి. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఓర్పు, పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. ఆదాయం సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బుధ, గురువారాల్లో పనులు ముందుకు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల హితవు మీపై చక్కగా పనిచేస్తుంది. లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సోదరుల మాటతీరు అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. యోగ, ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. నూతన యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం అవసరం. పొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. శుక్రవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. విమర్శలు పట్టించుకోవద్దు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలున్నాయి. అధికారులకు హోదామార్పు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి.