మకర రాశి 2021: బంధుమిత్రులతో మనస్పర్థలు, పెద్దల ఆరోగ్యం విషయంలో...
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం: 14 వ్యయం: 14 రాజపూజ్యం: 3 అవమానం: 1
ఈ రాశివారికి గురు, కేతువుల సంచారం అధికంగా వుంది. మనోధైర్యంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు పొందుతారు. ధన సమస్యలు కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. బంధుమిత్రులతో మనస్పర్ధలెదురవుతాయి.
పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కకపోవచ్చు. పారిశ్రామిక రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారు అతికష్టంమీద టార్గెట్‌ను పూర్తి చేస్తారు.
ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు నిరుత్సాహం అధికం. పాడి, వ్యవసాయ తోటల రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పౌల్ట్రీ, మత్స్య రంగాల వారికి ఆశాజనకం. స్థల వివాదాలు నిదానంగా కొలిక్కి వస్తాయి. విదేశీయాన యత్నం ఫలించకపోవచ్చు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.