శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (14:17 IST)

చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటిషన్ కొట్టివేత

chandrababu
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రిమాండు రిపోర్టును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేసింది.
 
చంద్రబాబుకి రిమాండ్ కొనసాగిస్తూ కొద్ది సేపటి కిందట ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు చంద్రబాబు తరుపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ స్క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. మూడు రోజుల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది.
 
మరోవైపు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ పిటీషన్ మీద ఏసీబీ కోర్టు తీర్పు వెలువడబోతోంది. హైకోర్టులో స్క్వాష్ పిటీషన్ మీద తీర్పు వెలువడుతున్న తరుణంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదుల కోరిక మేరకు ఈ ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది.