మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (17:47 IST)

కొత్తిమీరతో ఫేస్ ప్యాక్.. చర్మం మెరిసిపోతుంది.. తెలుసా?

Coriander face pack
కొత్తిమీరతో ఆరోగ్యానికే కాదు.. అందానికి మంచిదే. గుప్పెడు తాజా కొత్తిమీర తరుగులో రెండు చెంచాల కలబంద రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. కలబంద ముడతలు, గీతలను తగ్గిస్తుంది. 
 
ముఖంపై ఉండే నలుపుదనం, బ్లాక్‌హెడ్స్ తగ్గించుకోవడానికి కొత్తిమీర, నిమ్మరసం చక్కని పరిష్కారం. కొత్తిమీర ముద్దలో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. కొత్తిమీర ముద్దలో కాసిని పాలు, చెంచా తేనె, నిమ్మరసం కలపాలి. దీనిని ముఖానికి పూతలా వేసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే.. చర్మం మెరిసిపోతుంది. 
 
ఇంకా రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును, గుప్పెడు వేపాకుని కలిపి నీటిలో మరిగించాలి. ఆ నీళ్లలో రోజూ ఉదయాన్నే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. బొప్పాయి గుజ్జులో చెంచా పాలు, చెంచా తేనె కలిపి దాన్ని ముఖానికి రాసి.. మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా చర్మం నిగారింపుగా మారుతుంది.