సంబంధిత వార్తలు
- విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ వాయిదా
- Rakul Preet Singh: హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
- పరకామణి కేసులో పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయండి : హైకోర్టు
- వంట చేయకపోతే విడాకులు కావాలా...? కుదరని తేల్చి చెప్పిన హైకోర్టు
- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని అరెస్ట్ చేయవద్దు.. ఏపీ హైకోర్టు ఆదేశాలు
హీరో నవదీప్‌కు ఊరట.. డ్రగ్స్ కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
Navadeep
నవదీప్ తరపున వాదించిన న్యాయవాది వెంకట సిద్ధార్థ్, ఈ కేసులో నవదీప్ పేరు కేవలం ఎఫ్‌ఐఆర్‌లో మాత్రమే ఉందని, సంఘటనా స్థలంలో అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని కోర్టుకు తెలిపారు. సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువులలో, వాటికి నవదీప్‌కు సంబంధం ఉందని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఆయన వివరించారు.
ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, సరైన ఆధారాలు లేకుండా కేసును కొనసాగించడం సరికాదని వ్యాఖ్యానించింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించనందున, అతనిపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నవదీప్‌కు పెద్ద న్యాయపరమైన ఊరట లభించింది.
తర్వాతి కథనం
