శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (13:37 IST)

పెరుగులో తమలపాకుని నానబెట్టి కళ్లపై ఉంచుకుంటే?

చక్కని రుచిని, చక్కని ఆరోగ్యాన్ని అందించే పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పనిచేస్తుంది. అరకప్పు పెరుగులో చెంచా వేప పిండి, అరచెంచా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌ నూనెను కలుపుకుని తలకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చుల్ల

చక్కని రుచిని, చక్కని ఆరోగ్యాన్ని అందించే పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పనిచేస్తుంది. అరకప్పు పెరుగులో చెంచా వేప పిండి, అరచెంచా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌ నూనెను కలుపుకుని తలకు పట్టించాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చుల్లా తయారవడంతో పాటు చుండ్రు సమస్యలను అదుపులో ఉంచుతుంది.
 
పెరుగులో మెంతి గింజల్ని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలో అరచెంచా తేనె రెండు చుక్కల నిమ్మరసం కూడా కలుపుకుని వెంట్రుకలకు రాసుకుంటే జుట్టుకు కొత్త నిగారింపు వస్తుంది. పెరుగు చర్మానికి సహజసిద్ధ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. అందుకు సెనగపిండి, పెసరపిండి, తేనె కలుపుకుని చర్మానికి పట్టించి నలుగులా రుద్దుకోవాలి.
 
అప్పుడే దుమ్ము, ధూళితో పాటు మృతుకణాలు తొలగిపోయి అందంగా తయారవుతారు. కాసేపు పెరుగులో నానబెట్టిన తమలపాకుని కళ్లపై ఉంచుకుంటే వేడి హరించుకుపోయి తాజాగా కనిపిస్తారు. పావుకప్పు పెరుగులో అదే పరిమాణంలో కలబంద గుజ్జు, చెంచా సెనగపిండి, నిమ్మరసం, అరచెంచా బాదం నూనె కలిపి మెత్తగా చేసుకుని ముఖానికి పూతరా వేయాలి. 20 నిమిషాల పాటు ఉంచుకుని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.